కోతుల దాడితో గృహిణి మృతి

కోతుల దాడితో గృహిణి మృతి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద విషాదంగా మారింది. కోతుల గుంపు దాడి చేయబోతుండగా అడ్డుకునే ప్రయత్నంలో ఓ గృహిణి మెట్లపై నుంచి జారి పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల (50) బుధవారం ఉదయం ఇంటి ముందు పనులు చేస్తుండగా ఒక్కసారిగా కోతులు దూసుకొచ్చాయి. భయంతో వాటిని తరిమికొట్టే ప్రయత్నంలో అదుపుతప్పి ఇంటి మెట్లపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర...