అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..!

అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..! వెంకటేశ్వర వైన్స్‌లో నిబంధనలకు తూట్లు బహిరంగంగానే ఉల్లంఘనలు – కాన‌రాని త‌నిఖీలు కాకతీయ, కరీంనగర్ :కరీంనగర్ నగరంలో వైన్స్ నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తూ లాభాలే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టబద్ధంగా తీసుకున్న అనుమతులు ఒకలా ఉండగా, క్షేత్రస్థాయిలో నిర్వహణ మాత్రం పూర్తిగా విరుద్ధంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్మిట్ రూంల నిర్వహణకు స్పష్టమైన నియమాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి అనధికార సిట్టింగ్లు, టేబుళ్లు ఏర్పాటు చేసి మద్యం సేవించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారని స్థానికులు...