పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు
పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు టీ–పీ–టీ–ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలష్టి రమేష్ కాకతీయ, నెల్లికుదురు : పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ బిక్ష కాదని, అవి ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలష్టి రమేష్ స్పష్టం చేశారు. టీపీటీఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి యాకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలష్టి రమేష్ మాట్లాడుతూ, దాదాపు 32 నుంచి...