రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాల తగ్గింపు అతివేగం, మద్యం డ్రైవింగ్ ప్రాణాంతకం హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచే వేణు కాకతీయ, హుజురాబాద్ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచే వేణు తెలిపారు. హుజురాబాద్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు....