అదుపుతప్పి బోల్తా పడిన కాలేజీ వ్యాన్‌

అదుపుతప్పి బోల్తా పడిన కాలేజీ వ్యాన్‌ 20 మందికిపైగా విద్యార్థులకు గాయాలు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే పాయం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలో శుక్రవారం కాలేజీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. మణుగూరు నుంచి పాల్వంచలోని కేఎల్ఆర్ కాలేజీకి విద్యార్థులను తీసుకొస్తున్న వ్యాన్ కల్వర్టు వద్ద అదుపుతప్పడంతో రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా విద్యార్థినీ, విద్యార్థులు గాయపడ్డారు....