విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం

విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కాకతీయ, హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలపై చూపుతున్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం చూపడం లేదని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగం సమస్యలతో కుదేలవుతోందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఉద్యమాల ద్వారా హక్కులు...