చట్నీలో బల్లి… ఎనిమిది మందికి అస్వస్థత
చట్నీలో బల్లి… ఎనిమిది మందికి అస్వస్థత జగిత్యాల జిల్లా కేంద్రం హోటల్‌లో ఘటన కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్‌లో శుక్రవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. అక్కడ టిఫిన్లు తిన్న ఎనిమిది మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. టిఫిన్లకు వడ్డించిన చట్నీలో బల్లి పడినట్లు బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. టిఫిన్ తీసుకున్న కొద్దిసేపటికే బాధితులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా...