ప్రభుత్వ భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం
ప్రభుత్వ భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు సులభంగా అందుబాటులో సేవలు కాకతీయ, ఖిలా వరంగల్ : ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కొత్త ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయాన్ని శుక్రవారం శివనగర్ మీసేవ కేంద్రం వద్ద ఉన్న ప్రభుత్వ భవనంలోకి మార్చారు. ప్రారంభంలో కార్యాలయాన్ని లక్ష్మీపురం కమ్యూనిటీ హాల్‌కు తరలించే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ ప్రాంతం మండల ప్రజలకు దూరంగా ఉండటంతో సాధారణ...