సావిత్రిబాయి పూలేకి ఘన నివాళి
సావిత్రిబాయి పూలేకి ఘన నివాళి టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు మహిళా ఉద్యోగులకు శాలువాలతో సత్కారం కాకతీయ, ఖమ్మం : మహిళా విద్యకు మార్గదర్శకురాలు, సామాజిక సంస్కరణ యోధురాలు, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు....