మహిళా సాధికారతకు పూలే మార్గదర్శకం
మహిళా సాధికారతకు పూలే మార్గదర్శకం కాకతీయ, హుజురాబాద్ : భారతదేశపు తొలి మహిళా గురువు, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కూడలిలో పూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవించారు. పూలే ఆశయాలను గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు...