కష్టాల్లో ఉన్నవారికి ‘మనోజ్’ ధైర్యం

కష్టాల్లో ఉన్నవారికి ‘మనోజ్’ ధైర్యం మృతుడి కుటుంబానికి చేయూత.. రోగులకు ఆర్థిక భరోసా మానవత్వాన్ని చాటుకుంటున్న ‘మీ శ్రేయోభిలాషి బృందం’ కాకతీయ, ఖమ్మం : కష్టాల్లో ఉన్నామన్న పిలుపు విన్నా.. కన్నీరు పెట్టే దీనగాథ కనిపించినా.. ‘మేమున్నాం’ అంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది ‘మీ శ్రేయోభిలాషి బృందం’. బండి మనోజ్ కుమార్, గరిడేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సేవా ప్రస్థానం పలువురి జీవితాల్లో ఆశ కిరణాలు నింపుతోంది. శనివారం ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ రామన్నపేట, రామన్నపేట కాలనీ పరిసర ప్రాంతాల్లో పలువురు...