నాడు విద్యార్థి.. నేడు గ్రామ పాలకుడు

నాడు విద్యార్థి.. నేడు గ్రామ పాలకుడు లావుడ్య పూర్ణకు అరుదైన గౌరవం రేగ‌ళ్ల పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుల‌తో స‌త్కారం స్కూల్ సమస్యల పరిష్కారానికి స‌ర్పంచ్‌ హామీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రేగళ్ల పెద్దతండా ఆశ్రమ పాఠశాల శనివారం ఓ అరుదైన ఘ‌ట‌న‌కు వేదికైంది. ఇరవై సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో అక్షరాభ్యాసం చేసిన లావుడ్య పూర్ణ, నేడు అదే గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై, అదే పాఠశాలలో ఉపాధ్యాయుల చేతుల మీదుగా సన్మానం పొందారు. అక్షరాలు నేర్పిన గడప వద్దే ప్రజాప్రతినిధిగా గౌరవం అందుకోవడంతో పూర్ణ...