టీ–సేఫ్‌తో భద్రత… అవగాహనతో రక్షణ!

టీ–సేఫ్‌తో భద్రత… అవగాహనతో రక్షణ! ఈవ్ టీజింగ్‌, ర్యాగింగ్‌పై షీటీమ్ హెచ్చరిక కాకతీయ, వరంగల్ సిటీ : మహిళలు, బాలికలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్ ఘటనలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని షీటీమ్ ఆర్ఎస్ఐ స్వాతి పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ రామ్‌నగర్‌లోని షైన్ హై స్కూల్‌లో సుమారు 400 మంది విద్యార్థి, విద్యార్థినులకు షీటీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ స్వాతి మాట్లాడుతూ… సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఫోటోలు, మొబైల్...