ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు కాకతీయ, గణపురం : గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కావటి రజిత రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కావటి రజిత రవీందర్ మాట్లాడుతూ.. మహిళల విద్య కోసం జీవితాంతం పోరాడిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి...