ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ నీరుకుళ్ళలో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవం మాలధారుల నామస్మరణతో మార్మోగిన గ్రామం కాకతీయ, ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో హరిహరసుతుడు అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఆదివారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. సలేంద్ర వినోదాచార్యుల స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ మహా పడిపూజ కార్యక్రమం, పురోహితులు కరుణాకరాచార్య స్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తొలుత గణపతి, మహాలక్ష్మి, అయ్యప్ప స్వాములకు దీపారాధనలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి పంచామృతాలు, పండ్లు, పుష్పాలతో...