అయ్యప్ప శరణు ఘోషలతో మార్మోగిన గణపురం
అయ్యప్ప శరణు ఘోషలతో మార్మోగిన గణపురం రామాలయంలో ఇరుముడి మహోత్సవం కాకతీయ, గణపురం : గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయం ఆదివారం భక్తి పారవశ్యంతో దివ్య క్షేత్రంలా మారింది. ఆలయ ప్రాంగణమంతా “స్వామియే శరణమయ్యప్ప” నినాదాలతో మార్మోగగా, అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. వరంగల్‌లోని అయ్యప్ప స్వామి హరీహర క్షేత్రం నుంచి విచ్చేసిన గురుస్వామి కర్ణాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు శాస్త్రోక్తంగా ఇరుముడి కట్టించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు...