అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్
అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్ మేడారం పనుల్లో అలసత్వంపై సీరియస్ 12వ తేదీకల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశం నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలుంటాయని హెచ్చరిక కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లలో కనిపిస్తున్న నెమ్మదితనం, నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, శాఖాధికారుల పనితీరుపై మంత్రి ఘాటుగా మండిపడ్డారు. పనులు పూర్తి చేయకుండా కారణాలు చెప్పడం మానేయాలని అధికారులను...