రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం
రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ముందస్తుగా యూరియా టోకెన్ల పంపిణీ కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ కాకతీయ, ఖిలావరంగల్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోందని స్థానిక కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ తెలిపారు. ఆదివారం అరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు కోటల పరిధిలోని రైతులకు ముందస్తుగా యూరియా బస్తాల కూపన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ మాట్లాడుతూ… యాసంగి పంట వేసిన రైతులకు యూరియా కొరత రాకుండా...