ఇసుక మాఫియా బరితెగింపు..!
ఇసుక మాఫియా బరితెగింపు..! చింతిర్యాల ర్యాంపు నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా అనుమతులు లేకుండానే తోలకాలు మౌనంగా ఉంటున్న అధికారులు రేయింబవళ్లు ట్రాక్టర్ల హల్చల్… దుమ్ముధూళితో అశ్వాపురం గ్రామస్థుల నరకయాతన యంత్రాంగంపై ‘చేతివాటం’ ఆరోపణలు కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఇసుక అక్రమ రవాణా పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. చింతిర్యాల ర్యాంపును కేంద్రంగా చేసుకుని గత వారం రోజులుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రేయింబవళ్లు ఇసుకను తరలిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే బహిరంగంగా ఈ అక్రమ దందా సాగుతున్నా,...