ముగ్గులతో కిసాన్‌నగర్‌లో సంక్రాంతి కళ

ముగ్గులతో కిసాన్‌నగర్‌లో సంక్రాంతి కళ ముందస్తు వేడుకల్లో మహిళల ఉత్సాహం విజేతలను అభినందించిన యాదగిరి సునీల్ రావు కాకతీయ, కరీంనగర్ : ముందస్తు సంక్రాంతి వేడుకల సందర్భంగా కరీంనగర్ నగరంలోని కిసాన్‌నగర్ జమ్మిగద్దె సమీపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. చాడ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో పరిసర ప్రాంతాన్ని పండుగ వాతావరణంతో నింపారు. తెల్లవారుజామున నుంచే మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. సంప్రదాయ రూపాలు, ఆధునిక డిజైన్లతో...