కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి

కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్ కాకతీయ, కొత్తగూడెం : సింగరేణిలో కారుణ్య నియామకాలు, టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ నుంచి అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల వివరాలు, ఇప్పటికే కారుణ్య...