మల్లంపల్లి బ్రిడ్జి పనులపై ఎస్‌పీ సమీక్ష
మల్లంపల్లి బ్రిడ్జి పనులపై ఎస్‌పీ సమీక్ష కాకతీయ కథనానికి స్పందన మేడారం జాతరకు ఆటంకం లేకుండా ఆదేశాలు నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని సూచన కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు రోజులుగా మల్లంపల్లి–జాకారం మార్గంలో వాహనాల రాకపోకలు గణనీయంగా పెరగడంతో ఆదివారం రాత్రి కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిస్థితిపై కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన...