చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ?
చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ? ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డ అటవీ అధికారులు అసలు దోషులు తప్పించుకుంటున్నారా? ‘టన్నుల లెక్కన’ లంచం డిమాండ్ భద్రాద్రి జిల్లా అటవీశాఖలో అక్రమార్కులు ఏసీబీ దాడులతో మరికొంతమంది అధికారులపై చర్చ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కాసులకు కక్కుర్తి పడి అటవీ శాఖ అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటనతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కంచె చేను మేసిందా అన్న చందంగా ఉన్న ఈ వ్యవహారంలో, సోర చేపను వదిలేసి చిన్న చేపలకే ఏసీబీ...