హామీ మాటగా కాదు.. చేతలుగా నిలిచింది!
హామీ మాటగా కాదు.. చేతలుగా నిలిచింది! ఆడబిడ్డ పుడితే రూ.2,000 నజరానా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పెనుబల్లి మహిళా సర్పంచ్ కాకతీయ, కొత్తగూడెం : ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం సాధారణమే. కానీ గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం అరుదు. అలాంటి రాజకీయ వాతావరణంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచిన మహిళా సర్పంచ్‌గా పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ రెడ్డి సుజాత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయతీ నుంచి సీపీఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన...