గంజాయి ముఠా గుట్టు రట్టు
గంజాయి ముఠా గుట్టు రట్టు బొమ్మకల్ బైపాస్‌లో ముగ్గురు అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీసుల అప్రమత్తతతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. బొమ్మకల్ బైపాస్‌లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో కలిసి బొమ్మకల్ బైపాస్‌లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు...