సొర చేప తప్పించుకుందా..?
సొర చేప తప్పించుకుందా..? డామిట్ కథ అడ్డం తిరుగుతోందా..? సస్పెన్షన్ పేరుతో చేతులు దులుపుకున్నారా..? డివిజనల్ మేనేజర్‌పై చర్యలు శూన్యమా..? అటవీశాఖలో అవినీతి కథ వెనుక కమామీషు వేరేనా..? కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) కొత్తగూడెం డివిజన్‌లో లంచం వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అధికారుల విషయంలో చర్యలు తూతూ మంత్రంగా మారాయా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, కాంట్రాక్టర్ గుమస్తాను దాడి జరిగిన రోజే రిమాండ్‌కు...