విద్యుత్ సమస్యలను పరిష్కారించాలి

విద్యుత్ సమస్యలను పరిష్కారించాలి సర్పంచ్ ముదిరెడ్డి కళావతి కాకతీయ ఇనుగుర్తి  : మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాసరెడ్డి కోరారు. మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ భార్గవిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ఎదురవుతున్న కరెంటు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఏఈ భార్గవి హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలో ప్రధానంగా విద్యుత్ కేబుల్ వైర్ మార్పు అవసరమైందని, సర్వం...