గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల కీలకపాత్ర
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల కీలకపాత్ర కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు...