ప‌నుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి

ప‌నుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ రూ.60 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్లకు భూమిపూజ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్పష్టం చేశారు. నాణ్యతలో ఎలాంటి రాజీకి తావు లేదని, ప్రజల డబ్బుతో చేపట్టే పనులు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలన్నారు. మంగళవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి 1వ, 20వ డివిజన్ల పరిధిలోని ఆరెపల్లి–తీగలగుట్టపల్లి ప్రాంతాల...