సామాజిక సేవలతోనే సమాజంలో గుర్తింపు

సామాజిక సేవలతోనే సమాజంలో గుర్తింపు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కాకతీయ, కొత్తగూడెం : సామాజిక సేవల ద్వారానే సమాజంలో శాశ్వత గుర్తింపు లభిస్తుందని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయంలో సమాచార హక్కు సంరక్షణ చట్టం–2005 ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాచార హక్కు సంరక్షణ చట్టం ఆధ్వర్యంలో ప్రజల కోసం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ...