ఆవేశం కట్టలు తెంచుకుంది..!
ఆవేశం కట్టలు తెంచుకుంది..! గేట్లు బద్దలు కొట్టిన నర్సింగ్ విద్యార్థినుల వసతులు కల్పించడం లేదని మహబూబాబాద్‌లో ఆందోళన కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కళాశాల యాజమాన్యం వైఖరికి విసుగెత్తిన నర్సింగ్ విద్యార్థినులు గేట్లు బద్దలు కొట్టి నిరసనకు దిగారు. అద్దె భవనాల్లో సరైన మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే సొంత భవనం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థినులు బయటకు రాకుండా యాజమాన్యం గేట్లకు తాళాలు వేసి నిర్బంధించిందన్న ఆరోపణలతో ఆగ్రహం...