ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం

ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ప్రమాదవశాత్తు పూరిగుడిసెకు మంటలు చెలరేగి సగానికి పైగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రత్న నరసయ్య రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో నుంచి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. పూరిగుడిసె కావడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే ఇంటిలోని సుమారు 50 శాతం భాగం కాలిపోయినట్లు తెలిపారు....