న్యాయానికి మానవీయ స్పర్శ
న్యాయానికి మానవీయ స్పర్శ కక్షిదారురాలి వద్దకే వెళ్లి ఎవిడెన్స్ నమోదు దివ్యాంగురాలి బాధను గమనించిన తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ కాకతీయ, తొర్రూరు : తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి దామెర ధీరజ్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని, ప్రజాపక్షపాతాన్ని చాటుకున్నారు. ఒక సివిల్ కేసు విచారణ సందర్భంగా న్యాయానికి మానవీయ స్పర్శను జోడిస్తూ తీసుకున్న ఆయన నిర్ణయం ప్రజల హృదయాలను గెలుచుకుంది. విచారణకు హాజరైన పద్మ అనే కక్షిదారురాలు కాళ్లు పనిచేయక కోర్టు భవనం మొదటి అంతస్తుకు ఎక్కలేని పరిస్థితిలో...