కొత్త‌గూడెంలో 28న ఏజెన్సీ దళిత ర్యాలీ

కొత్త‌గూడెంలో 28న ఏజెన్సీ దళిత ర్యాలీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 28వ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు దళిత ఏజెన్సీ హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చదలవాడ సూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధి, రాజకీయ...