పదో తరగతికి ప్రత్యేక తరగతులు

పదో తరగతికి ప్రత్యేక తరగతులు ఉదయం–సాయంత్రం క్లాసులు తప్పనిసరి వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం.. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి డీఈఓ రాజేశ్వరరావు ఆదేశాలు కాకతీయ, నర్సింహులపేట : పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు ఆదేశించారు. గురువారం నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి, పాఠశాల దస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు....