పాఠశాలకు భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి
పాఠశాలకు భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి ఎఫ్‌ఆర్‌ఓకు సర్పంచ్ వినతి కాకతీయ, ఇనుగుర్తి : లాలూ తండాలోని ప్రభుత్వ పాఠశాలకు చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, 1993లో లాలూ తండాలో స్కూలు నిర్మాణం కోసం ఫారెస్ట్ పరిధిలోని రెండు ఎకరాల భూమిని కేటాయించారని గుర్తు చేశారు....