అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు

అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు కేయూ మెస్‌లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ నిర్ల‌క్ష్యం విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటం హాస్టల్ మెస్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు వీసీ చాంబర్‌ను ముట్టడించిన విద్యార్థినులు కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్ మెస్‌లో తీవ్ర భోజన భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో పురుగులు, ఇనుప తీగలు బయటపడటంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. విద్యార్థినుల ఆరోగ్యంతో యాజమాన్యం చెలగాటమాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నం, కూరలో పొడవాటి పురుగులు, నలుపు రంగు ఇనుప తీగలు స్పష్టంగా...