రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన
రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కాకతీయ, తొర్రూరు : జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా తొర్రూరు పట్టణంలో ఆటో, టాక్సీ, డీసీఎం వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తొర్రూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ధీరజ్ కుమార్, సీఐ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగం ప్రాణాలకు ముప్పని...