అధికారులు మారినా పేర్లు మారలే!
అధికారులు మారినా పేర్లు మారలే! నంబర్లు మారినా కొత్త నంబర్లు రాయలే!! చెన్నారావుపేట వ్యవసాయ కార్యాలయంలో అలసత్వం కాకతీయ, నర్సంపేట టౌన్ : రైతులకు కీలకమైన వ్యవసాయ సలహాలు, ప్రభుత్వ పథకాల సమాచారం అందించాల్సిన వ్యవసాయ శాఖ కార్యాలయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఇటీవల బదిలీల అనంతరం కొత్త ఏవోను నియమించి కార్యాలయాన్ని రైతు వేదికకు తరలించినప్పటికీ, పాత కార్యాలయం వద్ద ఈ మార్పును సూచించే బోర్డు ఏర్పాటు చేయలేదు. అంతేకాదు, బోర్డుపై ఇప్పటికే బదిలీ అయిన ఏడీఏ,...