అధిక యూరియాతోనే తెగుళ్లు
అధిక యూరియాతోనే తెగుళ్లు అవసరానికి మించి వాడితే నేల సారానికి నష్టం రైతులు ఆందోళన చెందవద్దు : వ్యవసాయ అధికారి వినయ్‌కుమార్ కాకతీయ, నర్సింహులపేట : పంటలకు అవసరమైనంత మేరకే యూరియా వాడాలని, అధికంగా వాడితే తెగుళ్లు, వ్యాధులు పెరుగుతాయని వ్యవసాయశాఖ అధికారి వినయ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం నర్సింహులపేట మండలంలోని వివిధ యూరియా పంపిణీ కేంద్రాలను ఆయన సందర్శించి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక యూరియా వాడకం వల్ల రసం పీల్చే తెగుళ్లు పెరగడమే కాకుండా నేల...