ఆసుపత్రులపై డీఎంఅండ్‌హెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

ఆసుపత్రులపై డీఎంఅండ్‌హెచ్‌వో ఆకస్మిక తనిఖీలు స్కానింగ్ సెంటర్ల రికార్డుల పరిశీలన కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ శనివారం పాల్వంచ పట్టణంలోని శ్రీ గణేష్ నర్సింగ్ హోమ్, పద్మావతి స్కానింగ్ సెంటర్, శ్రీరక్ష హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్ కేంద్రాల రికార్డులను పరిశీలించి, నిబంధనల ప్రకారం సేవలు అందిస్తున్నారా లేదా అన్నదాన్ని తనిఖీ చేశారు. చట్టవిరుద్ధంగా స్కానింగ్‌లు నిర్వహించి లింగ నిర్ధారణకు పాల్పడితే పీసీపీఎన్‌డీటీ చట్టం కింద...