ఎస్సారెస్పీ కట్టపై కబ్జాల కలకలం
ఎస్సారెస్పీ కట్టపై కబ్జాల కలకలం ముగ్గుపోసి పిల్లర్ల నిర్మాణానికి యత్నం సిబ్బంది రంగప్రవేశంతో నిలిచిన అక్రమ పనులు కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలో ఎస్సారెస్పీ కాలువ కట్ట భూముల ఆక్రమణలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన కాలువ కట్ట భూములను కొందరు అక్రమార్కులు బహిరంగంగానే కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. శనివారం కాలువ కట్టపై ఇండ్ల నిర్మాణానికి ముందస్తుగా ముగ్గులు పోసి, పిల్లర్ల కోసం రంధ్రాలు తవ్విన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా...