శాంతి భద్రతలపై సర్పంచ్‌లతో ముఖాముఖి
శాంతి భద్రతలపై సర్పంచ్‌లతో ముఖాముఖి కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఎస్సై క్రాంతి కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, తహశీల్దార్ రాజమల్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణలో సర్పంచ్‌ల పర్యవేక్షణ...