వాస్త‌వాల‌ను వెలుగులోకి తెస్తున్న ‘కాకతీయ’

వాస్త‌వాల‌ను వెలుగులోకి తెస్తున్న ‘కాకతీయ’ నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండర్ ఆవిష్కర‌ణ‌లో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్ : ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తీసుకొస్తున్న దినపత్రికగా కాకతీయ ప్రజల మనసు గెలుచుకుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. ఆయన తన క్యాంప్ కార్యాలయంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అతి తక్కువ కాలంలోనే కాకతీయ దినపత్రిక పాఠకుల మన్ననలు పొందడం హర్షణీయమన్నారు....