మామునూర్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ కొత్త రోడ్డు

మామునూర్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ కొత్త రోడ్డు గాడిపల్లి–రంగశాయిపేట మార్గం మూసివేత 36 ఎకరాల భూసేకరణ… రూ.95 కోట్ల అంచనా వ్యయం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మామునూర్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనుల నేపథ్యంలో గాడిపల్లి -రంగశాయిపేట రోడ్డును మూసివేయనుండటంతో, ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రోడ్డు అండ్ బిల్డింగ్స్ శాఖ రూపొందించిన ప్రతిపాదన మేరకు గాడిపల్లి నుంచి నక్కలపల్లి, దున్నాల కాలనీ, అక్షర టౌన్‌షిప్, బొల్లికుంట చెరువు రోడ్డుమీదుగా ఖమ్మం రోడ్డును కలిపేలా...