ఎంజీఎం హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు
ఎంజీఎం హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు కాకతీయ, గణపురం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్‌లో శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రంగవల్లి, పతంగి పోటీలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించింది. విద్యార్థులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించగా, హరిదాసుల సందడి, భోగిమంటలు, గాలిపటాల ఎగురవేతతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి....