స్మార్ట్ కిడ్జ్‌లో సంక్రాంతి సందడి
స్మార్ట్ కిడ్జ్‌లో సంక్రాంతి సందడి ముగ్గుల తోరణాలు.. బొమ్మల కొలువులు.. భోగి మంటల హుషారు కాకతీయ, ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శనివారం అంబరాన్ని తాకాయి. భోగి–సంక్రాంతి–కనుమ వేడుకలతో పాఠశాల ప్రాంగణం ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది. ఆవరణమంతా రంగురంగుల ముగ్గుల తోరణాలు, మామిడి ఆకుల అలంకరణలు కనువిందు చేశాయి. విద్యార్థులు భోగి మంటల వద్ద ఆనందంగా గడిపి, చిన్నారులకు భోగిపండ్ల వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బొమ్మల కొలువు, హరిదాసులు, డు–డు బసవన్నల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి....