హక్కు పత్రాల పేరుతో వేలల్లో వసూళ్లు
హక్కు పత్రాల పేరుతో వేలల్లో వసూళ్లు జాప్యాన్ని ఆసరాగా చేసుకుంటున్న దళారులు ‘డబ్బు ఇస్తే పని అయిపోతుంది’ అంటూ మభ్య పెడుతున్న వైనం అధికారుల పాత్రపైనా నెలకొంటున్న అనుమానాలు కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. భూమి హక్కు పత్రాల మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని అవకాశంగా మలుచుకుని, అమాయక గిరిజన రైతులను మోసం చేస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు...