సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు
సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు సర్పంచ్ యాకాలక్ష్మి ముందడుగు రైతులు, ప్రజల నుంచి అభినందనలు కాకతీయ, పెద్దవంగర : గట్లకుంట–రంగాపురం గ్రామాల మధ్య రహదారిపై భారీ గోతులు ఏర్పడి వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గట్లకుంట గ్రామ సర్పంచ్ ముత్తినేని యాకాలక్ష్మి సోమన్న తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. ఆదివారం రెండు గ్రామాలను కలిపే ప్రధాన మార్గంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి పోసి, డోజర్ సహాయంతో గోతులను పూడ్చి రహదారిని సరిచేశారు. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమయ్యాయి....