యూరియా కృత్రిమ కొరతపై ఏఐకేఎఫ్ ఆందోళన

యూరియా కృత్రిమ కొరతపై ఏఐకేఎఫ్ ఆందోళన కాకతీయ, నర్సంపేట : రైతులకు సబ్సిడీ ఎత్తివేసే ఉద్దేశంతోనే యూరియాను కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. సోమవారం వరంగల్ అండర్‌బ్రిడ్జి సమీపంలోని ఓంకార్ భవన్‌లో జరిగిన ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయానికి దారితీసే విధానాలు అవలంబిస్తోందని, నూతన విత్తన చట్టం రైతు వ్యతిరేకమని విమర్శించారు. యూరియా పంపిణీలో ఆన్‌లైన్...